ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం..సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం..సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం..సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ
– మంత్రి కేటీఆర్
టీ మీడియా, నవంబర్ 2, హైదరాబాద్ : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మా తాతకు 11 మంది పిల్లలు. 9 మంది ఆడపిల్లలు. ఇద్దరు మగపిల్లలు. మా నాన్న నంబర్ 10. అందరిలో చిన్నవాడు. పేరుకు దొరలు.. కానీ తెలంగాణలో ఆనాడు 500, 1000 ఎకరాలు ఉన్నా.. నీళ్లు లేవు కాబట్టి విలువ లేదు. మోట బావుల ద్వారా 50 ఎకరాల్లో వ్యవసాయం. మిగదంతా బీడు భూములే. ఇక 9 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే సరికి దాదాపు ఆస్తి కూడా ఏం జరుగుతుందో తెలుసు. కానీ కేసీఆర్ కాలేజీకి వెళ్లే రోజుల్లో రియలైజ్ అయ్యారు. తండ్రికి అండగా ఉండాలని భావించారు. అప్పటికే మా తాత(కేసీఆర్ తండ్రి) ముంబైలో సివిల్ కాంట్రాక్టులు చేశారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేశారని చెప్పారు. కేసీఆర్‌ను కలిసేందుకు సైరస్ మిస్త్రీకి ఒకసారి వచ్చారు. మా నాన్న మీ దగ్గర సబ్ కాంట్రాక్టర్‌గా పని చేశారని మిస్త్రీకి కేసీఆర్ తెలిపారు. ఆయన షాక్ అయ్యారు. ఇక ముంబై తిరిగి వెళ్లిన తర్వాత మిస్త్రీ అన్ని బుక్స్ తిరిగేసి, మళ్లీ కేసీఆర్‌కు ఫోన్ చేసి చెప్పారు.
Also Read : నాడు తండ్రుల మధ్య పోరు..
నిజమే మీ నాన్న 1950, 1960లో మా వద్ద సబ్ కాంట్రాక్టర్‌గా పని చేసినట్లు రికార్డుల్లో ఉందని కేసీఆర్‌కు సైరస్ మిస్త్రీ తెలిపినట్లు కేటీఆర్ వివరించారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.
Also Read : బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని చెప్పారు. చాలా ఎత్తుకు ఎదగాలని కలలు కనాలని, అలాంటివారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్ మిల్ పెట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా వాటర్‌వర్క్స్‌లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చామని వెల్లడిచారు. ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసేవాళ్లకు పోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్ మీట్ జరుపుకుందాని చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube