రైతుబంధు కావాలంటే కాంగ్రెస్‌ ఖతం కావాలి

రైతుబంధు కావాలంటే కాంగ్రెస్‌ ఖతం కావాలి

0
TMedia (Telugu News) :

రైతుబంధు కావాలంటే కాంగ్రెస్‌ ఖతం కావాలి

– మంత్రి హరీశ్‌ రావు

టీ మీడియా, నవంబర్ 27, జహీరాబాద్‌ : రైతుబంధు కావాలంటే కాంగ్రెస్‌ ఖతం కావాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రైతుబంధు పంపిణీని ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలని చెప్పారు. ఆ పార్టీని గ్రామ పొలిమేర నుంచి తరిమికొట్టాలని తెలిపారు. ఆ పార్టీనేత మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు రైతుబంధును బంద్‌ చేయిస్తున్నారని అన్నారు. రైతుల నోటికాడి బుక్కను అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రైతులతో తమది ఓదు బంధం కాదని పేగు బంధమని చెప్పారు. తాను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్‌ ఇచ్చిందన్నాను.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని.. రైతుబంధు ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ 11 సార్లు పంటపెట్టుబడి సాయం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఫిర్యాదుతో రైతుబంధును ఎన్నికల కమిషన్‌ ఆపిందన్నారు.

Also Read : సమానత్వాన్ని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి గురునానక్‌

రైతు బంధు కథం కావాలా.. కాంగ్రెస్ కథం కావాలా? అని ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు జహీరాబాద్ రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. రిస్కువద్దు కారుకు ఓటు గుద్దు అనిచెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి అనుకోకుండా గెలిచినా బీజేపీలోకి వెళ్తాడన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube