ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే

టీ మీడియా,ఏప్రిల్ 29,ఓదెల: పెద్దపల్లి జిల్లాఓదెల మండల పరిధిలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పొత్కపల్లి గ్రామ మసీదులో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం రోజున రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు స్నేహ భావాన్ని పెంచుతాయని ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలు పరుస్తున్న తీరును వివరించారు. ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ముందుగా అందరికీ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : ప్రజా సంఘర్షణ దీక్షకు మద్దతు ఇవ్వండి

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు, సింగిల్విండో చైర్మన్ ఆల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల మహేందర్, ఎంపీటీసీ రెడ్డి స్వరూప శ్రీనివాస్, మండల మైనార్టీ కో ఆప్షన్ నెంబర్,సాహెర్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, డాక్టర్ దాసరి రాజన్న, టిఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్,శ్రీకాంత్,డాక్టర్ సతీష్, కిషన్ రెడ్డి, సర్పంచులు,రవి, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, ఎమ్మార్వో రామ్ మోహన్,డాక్టర్ వంగ రవీందర్, అక్కల సుధాకర్, పిట్టల తిరుపతి, మరియు,ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube