ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

1
TMedia (Telugu News) :

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు
టీ మీడియా,ఏప్రిల్ 30,అశ్వారావుపేట :రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని అశ్వరావుపేట నియోజవర్గ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, గొడవర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. అశ్వరావుపేట స్థానిక పట్టణంలోని జామియా మసీదు నందు శుక్రవారం నాడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి హాజరై దీక్షలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కటి ఈ విందు ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని వారన్నారు.

Also Read : శనగకుంటలో సీతక్క పర్యటన

వారి దీక్ష విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నామని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జూజ్జురి వెంకన్న బాబు,టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ,అశ్వరావుపేట సహకార సమితి అధ్యక్షుడు చిన్నo శెట్టి సత్యనారాయణ, ఉత్తమ ఉపాధ్యాయులు వార్డు సభ్యులు యూఎస్ ప్రకాష్, ఎండి ఆసిఫ్ అలీ, షేక్ జలాల్, ఎండి నజీర్, ఉస్మాన్, రహమత్, హుస్సేన్, నయీమ్, పాషా, రియాజ్, ముస్లిం కమిటీ సభ్యులు,మసీద్ కమిటీ అధ్యక్షులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube