మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

1
TMedia (Telugu News) :

మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
టీ మీడియా, ఏప్రిల్ 30, వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తిలో ఉన్న 12 మసీదులలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాబట్టి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభంలో భాగంగా శనివారం పట్టణ పార్టీ కార్యాలయంలో నందిమల్ల అశోక్ శారదా ప్రధాన కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా సభ్యత్వం స్వీకరించారు.

Also Read : ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు నో పర్మిషన్‌

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉందని అన్నారు. ప్రత్యేకంగా పార్టీ సభ్యత్వ యాప్ ఏర్పాటు టిడిపి సభ్యత్వం పేరిట చేయడం జరిగిందని దీన్ని డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే పార్టీ కోఆర్డినేటర్ ఎండీ గౌస్ ని సంప్రదించగలరు అని కోరారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దస్తగిరి, ఎండీ గౌస్, సయ్యద్ ఫజల్, డి.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube