ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వరరావు

దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం

1
TMedia (Telugu News) :

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వరరావు

దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం

టీ మీడియా, ఏప్రిల్ 24,ఖమ్మం: జిల్లా తుమ్మలగడ్డ మున్నర పెట్ ప్రాంతంలో గ్రానైట్ మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కే ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు . పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉండే ఉపవాసాలను నియమాలతో ఉంది అల్లాహ్ ను ఆరాధిస్తూ పుణ్యఫలాలు పొందుతారన్నారు . దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం అని కనుక ఖురాన్ ను పటించి దానిని ఆచరించడం తద్వారానే సాఫల్యం కలుగుతుందని అన్నారు.

Also Read : పెద్దమ్మా.. నన్ను గుర్తు పట్టావా

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కర్నాటక కృష్ణ , షేక్ మక్బూల్ , షౌకత్ అలీ , మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎండీ ఖమర్ , టీఎన్జీవో అధ్యక్షులు అఫ్జల్ హసన్ , తాళ్ళూరి మధు , గ్రానైట్ ప్రసిడెంట్ తమ్మినేని వెంకటరావు , వెంకటరమణ , బాబురావు మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube