కౌన్సిలర్ల ను విస్మరించడం పై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల ఉమ్మడి భేటీ
కౌన్సిలర్ల ను విస్మరించడం పై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల ఉమ్మడి భేటీ
కౌన్సిలర్ల ను విస్మరించడం పై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల ఉమ్మడి భేటీ
టీ మీడియా, ఏప్రిల్ 24, మహబూబాబాద్ : అభివృద్ధి పనుల, నిధుల నిర్ణయాల పై కౌన్సిలర్ల ను విస్మరించడం పై అధికార, ప్రతిపక్ష (బిఆర్ఎస్, కాంగ్రెస్,సిపిఐ, సిపిఎం) కౌన్సిలర్ల ఉమ్మడి భేటీ. ఎమ్మెల్యే ఏక పక్ష నిర్ణ యాల పై కౌన్సిలర్ల మూకుమ్మడి నిరసన,ఒక వైపు వార్డు లకు 1 కోటీ రూపాయలు కేటాయించాలని కౌన్సిలర్లు అడుగు తుంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్డులలో సంభందం లేని వ్యక్తులతో కలియ తిరుగుతూ ఏక పక్ష నిర్ణయాలు తీసు కుంటున్నడు.14,15 వ ఆర్థిక నిధులు, పట్టణ ప్రగతి నిధులు వివిధ నిబంధనల తో 3 ఎండ్లుగా కౌన్సిల్ లో (అన్ని పార్టీల ) కౌన్సిలర్లు పలు సందర్భాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ ల దృష్టికి తీసుక రావడం ఆ నిబంధన ల వలన వార్డులకు నిధులు రాలేదు . ఇప్పుడు సిఎం కెసిఆర్ మహబూబాబాద్ మున్సిపాలిటీ కి కేటాయించిన 50 కోట్ల నిధులను కలెక్టర్, మంత్రి వర్యులు,ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ కౌన్సిలర్లు సమన్వయం తో చేయాల్సి ఉండగా కేవలం ఎమ్మెల్యే ఒక్కడే ఈ నిధుల పనుల కేటాయింపు పై మహబూబాబాద్ మున్సిపాలిటీ వార్డులలో పర్యటించడం సమంజసం కాదన్నారు.3 ఎండ్లుగ నిధులు లేక వార్డు లలో అభివృద్ధి జరగక పోవటం వల్ల వార్డుల ప్రజలకు సమాధానం చెప్తూ వచ్చిన కౌన్సిలర్ల కు ఇప్పుడు ఈ రకంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఎంత వరకు సబబో చెప్పాలన్నారు. కౌన్సిలర్ల హక్కుల కోసం నిధులు కేటాయింపు కోసం భవిష్యత్తు కార్య చరణ చేపడతాం అని తెలిపారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మ రెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి, సిపిఎం ఫ్లోర్ లీడర్ సుర్ణపుసోమయ్య,బిఆర్ఎస్ కౌన్సిలర్ ఎడ్ల వేణు, బి. నీరజ రెడ్డి, భుజ్జి వెంకన్న, బానోత్ హరిసింగ్, అరెంపుల విజయమ్మ, పోతు రాజు, కోడి నాగ లక్ష్మి, భూక్య శ్రీను, భూక్య సునీత, రవికుమార్, తాళ్ళ పల్లి జగన్, నిమ్మల శ్రీను పాల్గొన్నారు.
AlsoRead:వాబిదారి తనమా నీ జాడ ఎక్కడా?
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube