ఐకేపీ వివోఏ ల సమస్యలు పరిష్కరించాలి

ఐకేపీ వివోఏ ల సమస్యలు పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

      ఐకేపీ వివోఏ ల సమస్యలు పరిష్కరించాలి

– గట్టు మన్యం ఎస్సీ సెల్ కార్యదర్శి

టీ మీడియా, ఏప్రిల్ 26, పెద్దమందడి : పెద్దమందడి మండలంలో ఐకెపి వివోఏ లను సెర్ప ఉద్యోగులుగా గుర్తించాలని, నిరవధిక సమ్మె నేడు 10వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ, తమ యొక్క సంఘీభావం ప్రకటించింది.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్ మాట్లాడుతూ, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధాలు లేకుండా ప్రతి నెల వేతనాలు వివోఎల వ్యక్తిగత ఖాతాలో వేయాలని అన్నారు. ఐకెపి వివోఏ ల తక్షణమే డిమాండ్లను పరిష్కరించి, వారికి కనీస వేతనం గుర్తించి, ₹3900 ఇస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా అన్నారు. జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గట్టు మన్యం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో, గ్రామస్థాయిలో 17,606 మంది వివోఏలు పనిచేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాల దాటిన, వివోఏల బ్రతుకులు ఏమి మారలేదని మండిపడ్డారు.వివోఏ లకు కొత్త కొత్త సర్వేలు చేపిస్తూ పని భారం పెంచుతున్నారని గట్టు మన్యం అన్నారు. ఐకెపి వివో ఏ లను సెర్ప ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కనీసం వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు 10 లక్షల సాధారణ భీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని సెర్ప నుండి ఐడి కార్డులు ఇవ్వాలి అని గట్టు మన్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ కోఆర్డినేటర్ శ్రీనాథ్, అల్వాల ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు), శేఖర్ రెడ్డి, వివో ఎలా మండల అధ్యక్షుడు ఆంజనేయులు , ఉపాధ్యక్షుడు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి మోతిబాయ్, వివోఏ లు & తదితరులు పాల్గొన్నారు.

AlsoRead:అదానీ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు కాషాయ పార్టీ కుయుక్తులు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube