ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

1
TMedia (Telugu News) :

ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

టి మీడియా,సెప్టెంబర్ 13, గోదావరిఖని : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంగళవారం రోజు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన కాంట్రాక్టు కార్మికులను మరియు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులను అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గోదావరిఖని లోని ప్రధాన చౌరస్తాలో శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ ప్రజాసంఘాల నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మేండే శ్రీనివాస్, ఐద్వ జిల్లా కార్యదర్శి మహేశ్వరి,డివైఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాగర్ లను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

 

Also Read : విఆర్ఎ ల తో మంత్రి కెటిఆర్ భేటీ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు విషయంలో అదేవిధంగా వారికి ఇచ్చిన హామీలపై గత సంవత్సర కాలంగా కూడా చర్చలు జరుపుతూ కాలయాపన చేయడమే తప్ప వాటి అమలుకై చర్యలు తీసుకోకపోవడంతో గత నాలుగు రోజులుగా కాంట్రాక్టు కార్మికులందరూ కూడా జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అయిన కానీ ఇప్పటికి కూడా యాజమాన్యం గాని రాష్ట్ర ప్రభుత్వంగానీ స్పందించకపోవడంతో మంగళవారం రోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి కార్మికులందరూ కూడా సిద్ధమైన సందర్భంగా అర్ధరాత్రి సమయం లో జేఏసీ నాయకులైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, ఐఎఫ్టియు నాయకులు తోకల రమేష్ లను మరియు కాంట్రాక్టు కార్మికుల అందరిని కూడా అక్రమంగా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.

ఈ అరెస్టులను నిరసిస్తూ సిపిఎం పార్టీ, ఐద్వ, సీఐటీయూ, డివైఫ్ఐ, పట్నం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను కూడా అక్రమంగా అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అని వెంటనే ఏవైతే కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్విట్ల నరసయ్య, ఆరెపల్లి రాజమౌళి,ఎస్కే గౌస్, లలిత,పైమధా,కృష్ణ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube