జర్నలిస్ట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

0
TMedia (Telugu News) :

అరెస్ట్ చేసిన ఐదుగురు జర్నలిస్ట్ లను బేషరతుగా విడుదల చేయాలని భారీ ర్యాలీ
మల్కాన్ గిరి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు విలేకర్ల ధర్నా

ప్రజాశక్తి… చింతూరు

ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా లోని అక్రమ కేసు లు పెట్టి ఐదుగురు జర్నలిస్ట్ లను అరెస్ట్ చేయూటం పట్ల మల్కాన్ గిరి జిల్లా జర్నలిస్ట్ లు ఆందోళన కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం చింతూరు మండలం నుండి సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర భాస్కర్ చారి. సూర్య విలేకరి నరేష్. ఆంధ్ర ఖ్యతి బేడే సతీష్. ఎస్. కె. షాజహాన్ లు ఆందోళన కార్యక్రమం లో పాల్గొన్నారు. తోలుత మల్కానగిరి జిల్లా కేంద్రం లోని బస్ స్టాండ్ నుండి భారీ సంఖ్య లో జర్నలిస్ట్ లు ర్యాలీగా బయలు దేరినారు. జర్నలిస్ట్ లపై పోలీస్ జూలూం నశించాలి. పత్రిక స్వచ్ఛ పై పోలీస్ ల అణచి వేత ను ఖండిం చాలని. అరెస్ట్ చేసిన ఐ దుగురు విలేకర్లను భేషరతు గా విడుదల చేయాలని నినాదలు చేశారు.

కొంతసేసు జిల్లా ఎస్ పి కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం ఎస్ పి కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ధర్నా శిబిరం లో సీనియర్ పాత్రికేయులు ఎస్. కె. షాజహాన్ మాట్లాడు తూ విలేకరుల పట్ల పోలీస్ యంత్రాంగం చాలా దుర్మార్గంగా వ్యవహారిస్తుందని. ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు సరైన చికిత్స లు. ఆహరం అందక పోవటం తో రోగుల ఇబ్బందులను తమ మీడియాలో ప్రచురించినందుకు అర్ధరాత్రి విలేకర్ల ఇంటి పై పడి పోలీస్ లు బలవంతం గా బయటికి లాగి వ్యాన్లో ఎక్కించి అక్రమంగా అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం అన్నారు. గతంలో 15 సంవత్సరాల క్రితం జర్నలిస్ట్ పై విచక్షణారహితంగా దాడి చేసి విలువైన మీడియా వారి కెమెరాలు ధ్వంసం చేశారని జర్నలిస్టులను పశువుల లాఠీలతో కొట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అవినీతిని వెలికితీసేందుకు జర్నలిస్టులు ప్రాణాలొడ్డి విధి నిర్వహణ చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులపై కక్షపూరిత విధానాలు మానుకోవాలని లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన ఐదుగురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చతిస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా, దంతేవాడ జిల్లా బస్తర్ జిల్లా ఒడిశాలోని కొరాపుట్ నవరంగపూర్ జిల్లాల నుండి వందల సంఖ్యలో జర్నలిస్ట్ లో పాల్గొనడం జరిగింది.

Illegal cases against journalist should be dropped.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube