అక్రమ కేసులు ఎత్తివేయాలి.

అక్రమ కేసులు ఎత్తివేయాలి.

1
TMedia (Telugu News) :

అక్రమ కేసులు ఎత్తివేయాలి

టి మీడియా, అక్టోబర్,18,ఆదిలాబాద్ జిల్లా :  తీన్మార్ మల్లన్నా టి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించాడాం జరిగింది ఈకార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో నెలకొన్న భూవివాద సమస్య పరిష్కారానికి హాజరైనందుకు 7200 తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్యా పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్ తాళ్ల రవీందర్ డిమాండ్ చేశారు.

Also Read : బియ్యం కావాలా.. పైసలా

సోమవారం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.. ధర్మారం గ్రామంలో దళితుల మధ్య భూ వివాదం పరిష్కరించాలని బాధితులు రాష్ట్ర కన్వీనర్ను ఆశ్రయించారన్నారు.కానీ రాష్ట్ర కన్వీనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సరికాదన్నారు. అతనిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోకన్వీనర్ ఆరేపల్లి సురేష్, సభ్యులు సాయికుమార్,కిరణ్, మోతిరామ్,క్రాంతి,మనోజ్ సతీష్,కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube