అక్ర‌మరీతిలో ఓట‌ర్ల‌ డేటా సేక‌ర‌ణ‌

-క‌ర్నాట‌క సీఎంపై ఆరోప‌ణ‌లు

1
TMedia (Telugu News) :

అక్ర‌మరీతిలో ఓట‌ర్ల‌ డేటా సేక‌ర‌ణ‌

-క‌ర్నాట‌క సీఎంపై ఆరోప‌ణ‌లు

టీ మీడియా, నవంబర్ 17, బెంగుళూరు : ఓట‌ర్ల నుంచి అక్ర‌మరీతిలో డేటాను సేక‌రిస్తున్న‌ట్లు క‌ర్నాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మైపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఓ ఎన్జీవో ద్వారా బెంగుళూరు ఓట‌ర్ల నుంచి డేటా సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. సీఎం బొమ్మై ఎన్నిక‌ల ఫ్రాడ్‌కు పాల్ప‌డ్డార‌ని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చిలుమే ఎడ్యుకేష‌న‌ల్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ట్ర‌స్ట్ ద్వారా ఓట‌ర్ల నుంచి అద‌న‌పు స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నిక‌ల సంఘం ద్వారా ఓ అవగాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, ఆ స‌మ‌యంలో ఓట‌ర్ల నుంచి వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : మెటా హెడ్‌గా సంధ్యా దేవ‌నాథ‌న్ నియామ‌కం

కులం, విద్యార్హ‌త‌లు, మాతృభాష‌, ఆధార్ సంఖ్య‌, ఇత‌ర వివ‌రాల‌ను ఎన్జీవో సేక‌రించింది. అయితే బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ల‌మంటూ ఎన్జీవో ఆ డేటాను సేక‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీఎం బొమ్మై, బెంగుళూరు న‌గ‌ర‌పాల‌క క‌మీష‌న‌ర్‌, ఇత‌ర అధికారుల‌పై కాంగ్రెస్ పార్టీ పోలీసు క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నిక‌ల అక్ర‌మాల‌కు సీఎం పాల్ప‌డ్డార‌ని, ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి, అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube