విలేకరుల ముసుగులో డిమాండ్ చేస్తూ అక్రమ వసూళ్లు

పలువురు విలేకరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

1
TMedia (Telugu News) :

విలేకరుల ముసుగులో డిమాండ్ చేస్తూ అక్రమ వసూళ్లు

– పలువురు విలేకరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

టీ మీడియా, అక్టోబర్ 29, తిరుమలాయపాలెం : మండల పరిధిలోని సుబ్లేడ్ గ్రామానికి చెందిన కొందరు విలేకరుల ముసుకులో అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన చోటుచేసుకుంది పిండిప్రోలు గ్రామంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో వర్కర్లకి 18 సంవత్సరాల నిండకముందే బంకులో విధులు నిర్వహిస్తున్నారని కొందరు విలేకరులు శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీడియోలు ఫోటోలు తీసి బంకు యాజమాన్యానికి పెట్టి బెదిరించిన సంఘటన చోటుచేసుకుంది.

Also Read : చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసిన శ్రీకర్.

బంకు నిర్వాహకులు తుమ్మేటి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం మీ బంకులో 18 సంవత్సరాల నిండని చిన్న పిల్లవాడిని పెట్టి బంకు లో పనిచేస్తున్నారని యజమానితో చెప్పటం యజమానిపై రెవెన్యూ అధికారులకు చెప్తానని బెదిరించి 12,000 డిమాండ్ చేయగా ఇందులో పని చేస్తున్న వర్కర్ భయపడి 6000 రూపాయలు ఇవ్వగా ఆ విషయాన్ని బంకు నిర్వాహకులకు తెలియజేయగా ఆయన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో పలు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బంకు నిర్వాహకులు మా దగ్గర 18 సంవత్సరాల నిండని వ్యక్తులు ఎవరు పనిచేయట్లేదని యాజమాన్యం వారు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube