మద్యం దుకాణంలో అక్రమ ధరలు

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 4 వాజేడు :
ములుగు జిల్లా వాజేడు మండలం లో మద్యం దుకాణాలు ఎంఆర్ పి రేట్లకు ఎక్కువ అమ్ముతున్నారని గ్రామ ప్రజలు మద్యం దుకాణం ముందు ధర్నా చేపట్టారు. ఎంఆర్ పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతున్న ఎక్సైజ్ సిఐ కి ఎన్నిసార్లు చెప్పినా మద్యం దుకాణ యజమానులతో కుమ్మక్కై ఎటువంటి చేయకుండా జాప్యం చేస్తున్నారని గ్రామ ప్రజలు అన్నారు.ప్రజలకు ఎంఆర్ పి రేటు కన్నా ఎక్కువ అమ్మ వద్దని పిసా గ్రామ సభలో గ్రామ సర్పంచ్ ప్రజల ముందు నిర్ణయించడం జరిగింది. అయినా కూడా మద్యం దుకాణ యజమాన్యం షాప్ పేరు లేకుండా మద్యం రేట్లు పట్టిక లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏం ఆర్ పి కన్నా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. ప్రజలను చూసి బ్రాందీ షాప్ కి తాళం వేసుకుని పరారయ్యారు .అధికారులు ఇప్పటికైనా స్పందించి కేసు నమోదు చేయాలని గ్రామస్తులు ఎక్స్చేంజ్ సీఐ నీ డిమెండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube