అక్రమ పునాదులు పై అపార్టుమెంటు

అక్రమ పునాదులు పై అపార్టుమెంటు

2
TMedia (Telugu News) :

అక్రమ పునాదులు పై అపార్టుమెంటు

-ఫుట్ పాత్, రోడ్డు ద్వంసం

-టాయిలెట్, లావెట్రి పైపు డ్రైన్ లోకి

– నిర్మాణఅవసరాలకు గృహాకరెంట్

-మున్సిపల్ అనుమతులు పైన అనుమానం

టి మీడియా, జూన్6,ప్రత్యేక ప్రతినిధి:

మంత్రి అజయ్ కుమార్ కృషి తో నగరం నలువైపులా అభివృద్ధి చెందింది.రియల్ వ్యాపారం కూడా పెరిగింది ముక్యంగా హైదరాబాద్ స్థాయిలో ఆపార్టుమెంట్ కల్చర్ విస్తరించింది.దీనిని ఆసరా చేసుకుని కొంతమంది అభివృద్ధి కార్యక్రమాలు ను కూడా నాశనం చేసి నిర్మాణం లు చేస్తున్నారు .నగరంలో ని శాంతినగర్ పాఠశాల ప్రక్క రోడ్ లో ఆపార్టుమెంట్ నిర్మాణం కోసం ఫుట్ బిల్డర్ ఫుట్ ఫాత్ ని ,రహదారిని అక్రమించడం తో పాటు,హరితహారం మొక్కలను కూడా నాశనం చేస్తున్నరు.పాయికాన దొడ్డి ట్యాంక్ లేకుండ నిర్మించి, పైపు లైన్ ద్వారా మలం ను సైడ్ కాలువ లోకి వదిలే ఏర్పటు ద్వారా స్వచ్చ భారత్ ను అపహాస్యం చేశారు. అదే డివిజన్ లోని మరో చోట ఇంకో నిర్మాణము చేస్తున్న వ్యక్తి ఏకంగా ఆధునిక టెక్నాలజీ తో వేసిన రోడ్డు పై జేసిబి బకెట్ పెట్టి కొట్టించడంజరిగింది.ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం అనుమానం కలిగిస్తోంది. 500లు కరెంట్ బిల్లు ఉంటే సరఫరా నిలిపివేసే విద్యుత్ శాఖ అధికారులు అపార్ట్ మెంట్ నిర్మాణం లకు అక్రమ పద్ధతుల్లో విద్యుత్ వినియోగం చేస్తే చూస్తూ ఉరుకోవడం వెనుక అంతర్యం ఏమిటి అనే చర్చ జరుగుతోంది.

 

Also Read : మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

స్వచ్చభారత్ అపహాస్యం
స్వచ్ఛభారత్ ని అపహాస్యం చేస్తూ ఫుట్ ఫాత్ అనుకోని మున్సిపల్ జాగాలో సొంత అవసరాల కోసం టాయిలెట్స్ నిర్మించి .విసర్జన చేసినవి మున్సిపల్ కలువలోకి వెళ్ళే విధంగా పైపు లైన్ వేసి స్వచ్ఛ భారత్ ను అపహాస్యం చేయడం వెనుక అధికారులు అండ అనేది తెలుస్తోంది.ఇక నైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube