అక్ర‌మ మైనింగ్ కేసు.. 18 ప్ర‌దేశాల్లో ఈడీ సోదాలు

అక్ర‌మ మైనింగ్ కేసు.. 18 ప్ర‌దేశాల్లో ఈడీ సోదాలు

1
TMedia (Telugu News) :

అక్ర‌మ మైనింగ్ కేసు.. 18 ప్ర‌దేశాల్లో ఈడీ సోదాలు
టీ మీడియా,మే 6,న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని అక్ర‌మ మైనింగ్ కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) 18 ప్ర‌దేశాల్లో సోదాలు నిర్వ‌హించింది. మ‌న్రేగా నిధుల‌ను మైనింగ్ పేరుతో దుర్వినియోగం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జార్ఖండ్‌లోని ఓ సీఏ ఇంటి నుంచి 17 కోట్ల న‌గ‌దు, డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేశారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా సింఘాల్‌కు సీఏ స‌న్నిహితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : ఆన్‌లైన్‌ లోన్ల పేరిట నకిలీ యాప్‌లు

రాంచీ, చండీఘ‌డ్‌, ముంబై, కోల్‌క‌తా, ముజాఫ‌ర్‌పుర్‌, స‌హ‌స్ర‌తో పాటు ఎన్సీఆర్‌, నోయిడా, ఫ‌రీదాబాద్, గురుగ్రామ్‌లో సోదాలు జ‌రిగాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర మైనింగ్ మంత్రిగా కూడా కొన‌సాగుతున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి సోదాలు జ‌రుగుతున్నాయి. స్థానిక పోలీసులు ఈడీ సోదాల‌కు స‌హ‌క‌రిస్తున్నారు. కొంద‌రు వాంగ్మూలాన్ని సేక‌రిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube