నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా

నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా

1
TMedia (Telugu News) :

నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా

టీ మీడియా, ఆగస్టు 13, మహానంది:

మహానంది మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా జరుగుతోంది. వెదురు మోపులు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయమై శనివారం రాత్రి విలేకరులకు సమాచారం అందింది.దీంతో విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లే సరికి భారీ సంఖ్యలో వెదురు మోపులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వెదురు మోపులు ఉంచిన స్థలంలోను, చుట్టు పక్కల మనుషుల జాడ మాత్రం లేదు. మండలంలోని తదితర ప్రాంతాల నుంచి వెదురుతో పాటు ఇతర కలప కూడా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోందని స్పష్టం అవుతోంది.ఇంత జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ సిబ్బంది, అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. వెదురు రవాణాపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube