భార్యాభర్తల బదిలీలను వెంటనే చేపట్టాలి

కలెక్టరేట్ ముందు స్పౌజ్ ఉపాధ్యాయుల ధర్నా

1
TMedia (Telugu News) :

భార్యాభర్తల బదిలీలను వెంటనే చేపట్టాలి
-కలెక్టరేట్ ముందు స్పౌజ్ ఉపాధ్యాయుల ధర్నా…

టి మీడియా,జూలై25ఖమ్మం : రాష్ట్రంలో 317 జీవో వలన వేరు చేయబడిన భార్యాభర్తలను సుమారు 1800 మందిని ఒకే చోటికి చేర్చాలని మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే విద్యాబోధన సజావుగా సాగుతుంది . కానీ 317 జీవో వలన భార్యాభర్తలు వేరు వేరు చోట ఉండటం వలన పిల్లల బాగోల్ని పట్టించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి . సీఎం గారు సైతం భార్యాభర్తలను ఒకే చోటికి తీసుకువస్తానని మానవతా దృక్పథంతో ఒకే చోటుకు చేరుస్తానని హామీ ఇచ్చారు .

 

Also Read : డీజేఫ్ జిల్లా అధ్యక్షునిగా తీగల శ్రీనివాస్ రావు నియామకం

 

దయచేసి మా కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భార్యాభర్తలను ఒక చోటికి చేర్చి మా కుటుంబాలను పిల్లలను కాపాడాలని , విద్యాభివృద్ధికి దోహదపడాలని మనవి చేస్తున్నాము . ఈ విషయంపై ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో స్పాజ్ ఫోరమ్ అధ్యక్షులు బి. అమ్రు.కామ్ , కన్వీనర్ విజయ్ , వెంకటేశ్వర్లు , శశిధర్ , సుభాషిణి , పద్యం , సక్కుబాయి , శ్రీనివాస్ , నరసింహారావు , మాధురి, రాజ్యలక్ష్మి , మాధవి , స్వర్ణలత , కవిత , సుభాషిని తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube