ఏపీ ప్రభుత్వం

కీలక నిర్ణయం..

0
TMedia (Telugu News) :

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

టిమీడియా, మార్చి2,అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్‌, హంగేరీలకు ప్రతినిధులనుపంపాలనిముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థులవివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది.ఆపరేషన్‌ గంగ గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండుదేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్‌ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube