శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే..

శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే..

0
TMedia (Telugu News) :

శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే..

లహరి, పిబ్రవరి 23, కల్చరల్ : సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా అంచనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు తప్పకుండా ఉంటాయి. అయితే, ప్రతి పుట్టుమచ్చ శుభానికి సంకేతం అని భావించొద్దు. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశం.. దాని పరిమాణం ఏంటి అన్నదానిని బట్టి సాముద్రిక శాస్త్రంలో ఫలితాలను పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం.. కొన్ని చోట్ల ఉండే పుట్టుమచ్చలు వారికి అదృష్టాన్ని, సంపదకు కారణం అవుతాయి. మరి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గడ్డం మీద పుట్టుమచ్చ..
సాముద్రికశాస్త్రం ప్రకారం.. గడ్డం మీద పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక్కడ పుట్టుమచ్చ ఉండటం వల్ల వక్యి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీంతో పాటు, ఈ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపుతారు. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు గ్రూమింగ్ పట్ల ఎక్కువ ఇష్టపడతారు. ఈ మహిళలు ఫ్యాషన్ కోసం చాలా ఖర్చు చేస్తారు. అలాగే వారు అదృష్టవంతులు.

అరచేతిలో పుట్టుమచ్చ..
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఈ వ్యక్తులు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. అలాగే, ఈ వ్యక్తులు కళా ప్రేమికులు. ప్రయాణాలను ఇష్టపడతారు. వీరు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. ఆత్మగౌరవం కలిగి ఉంటారు. అయితే ఈ వ్యక్తులు కాస్త బద్ధకంగా ఉంటారు. దానివల్ల వారికే నష్టం.

Also Read : మత్స్య అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన యాదగిరీశుడు

వీపుపై పుట్టుమచ్చ..
వీపుపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. వీరు కాస్త ఫన్నీ స్వభావం కలిగి ఉంటారు. నిర్భయంగా ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీంతో పాటు, ఈ వ్యక్తులు చిన్న వయస్సులో ధనవంతులు అవుతారు. తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.

ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ..
సాముద్రికశాస్త్రం ప్రకారం.. ఉంగరపు వేలిపై పుట్టుమచ్చ ఉన్నవారు ఆచరణాత్మకంగా, సామాజికంగా ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు, ప్రజాదరణ కలిగి ఉంటారు. వీరు సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడుతారు. చెప్పాల్సింది నేరుగా, భయం లేకుండా చెప్పేస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube