బఠిండా ఘటనలో జవాన్లను కాల్చింది సైనికుడే

- సైనికుడి అరెస్ట్‌

0
TMedia (Telugu News) :

 బఠిండా ఘటనలో జవాన్లను కాల్చింది సైనికుడే

– సైనికుడి అరెస్ట్‌

టీ మీడియా, ఏప్రిల్ 17, చండీగఢ్‌ : పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌ లో ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత బుధవారం తెల్లవారుజామున 4:35 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్​పోలీసులు నలుగురు జవాన్లను చంపింది ఓ సైనికుడే అని గుర్తించారు. ఈ మేరకు సోమవారం ఉదయం నిందితుడిని అరెస్టు చేశారు. కేసు వివరాలను సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు గుల్నీత్‌ సింగ్‌ ఖురానా వెల్లడించారు. ఈ కేసులో మొదట తమన తప్పుదోవ పట్టించిన మోహన్‌ దేశాయ్‌ అనే సైనికుడే నిందితుడని వెల్లడించారు. అతడే కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన జవాన్లతో దేశాయ్‌కి వ్యక్తిగత వైరం ఉందని గుల్నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మేజర్‌ అషుతోశ్‌ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్‌ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో.. మోహన్‌ దేశాయ్‌ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి

 

AlsoRead:అడపాదడపా ఉపవాసం ఉంటున్నారా?

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube