కాంగ్రెస్‌లో లుకలుకలు..
– సీఎం సిద్ధూను గద్దె దింపేందుకు మంత్రుల పావులు
టీ మీడియా, అక్టోబర్ 23,
బెంగళూరు:కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు షురూ అయ్యాయి. సీఎం సిద్ధరామయ్యను గద్దె దింపేందుకు మంత్రులు పావులు కదుపుతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. కర్నాటక.. కర్నాటక.. కర్నాటక.. ఇదీ దాదాపు ఐదారు నెలలు నుంచి రాజకీయంగా మోత మోగిపోతున్న పేరు.. అయితే.. కర్నాటక ఎన్నికల తంతు ముగిసింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. సీఎంగా సిద్ధరామయ్య సర్కార్ పాలన కొనసాగిస్తోంది. అంతేకాదు.. కర్నాటక గెలుపు తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు మాంచి ఊపొచ్చింది.
also read :టి మీడియా న్యూస్ యూట్యూబ్ ఛానల్ పోస్టర్ ఆవిష్కరించిన డా.యాలమూడి
అదే స్పీడ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది టీకాంగ్రెస్. సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ పిడుగుపాటు టీకాంగ్రెస్ శ్రేణులను కలవరపాటు గురిచేస్తోంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్‌లో మార్పు కష్టమని మరోసారి రుజువవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడవక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్‌కు చేరాయి. సీఎం సీట్లో మరో వ్యక్తిని కూర్చబెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయి. సీఎం సిద్ధరామయ్యను గద్దెదింపడానికే స్వయంగా ఆయన మంత్రివర్గ సహచరులే పావులు కదపడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.సీఎం సిద్ధరామయ్యను గద్దె దింపేందుకు మంత్రి సతీశ్ జార్ఖిహోలి నేతృత్వంలో 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసిందనే టాక్ కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టించింది. దాంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హుటాహూటిగా బెంగళూరుకు చేరుకొని మంత్రి జార్ఖిహోళితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ మంచిదికాదంటూ నచ్చజెప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం నడుస్తోంది.ఇక.. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే వర్గాలకు దూరంగా ఉండే మరో వర్గం తాము ఎందుకు సీఎం కావద్దనే ఆలోచనలతో క్యాంప్ రాజకీయాలు మొదలెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా.. మూడు వర్గాల కర్నాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.
Confusion in Congress..
– Ministers’ steps to oust CM Sidhu
Tea Media, October 24,
Bengaluru: There has been a stir in the Karnataka Congress. The campaign that the ministers are moving to oust CM Siddaramaiah is creating a stir. Karnataka.. Karnataka.. Karnataka.. This is the name that has been buzzing politically for about five or six months.. However.. Karnataka elections are over.. Congress has come to power. Siddaramaiah Sarkar is continuing to rule as CM. Moreover, after the victory in Karnataka, the Congress got a boost in Telangana as well.
also read: T Media News YouTube channel poster unveiled by Dr. Yalamudi
The Congress is going to the assembly elections with the same speed. At exactly such a time, a thunderbolt is disturbing the ranks of the Tea Congress. It is once again proving that change in Congress is difficult as worry is dead. Even after five months of Congress coming to power in Karnataka, the politics of disunity and internal strife reached the peak stage. Efforts to install another person in the seat of CM have intensified. The politics of Karnataka has suddenly heated up as his cabinet colleagues have moved to oust CM Siddaramaiah. The talk that a camp with 20 MLAs led by minister Satish Jarkhiholi has been formed to oust CM Siddaramaiah has created a stir in the Congress party. With that, the Congress leadership entered the field. It seems that Congress National Representative Randeep Surjewala has reached Bangalore and held discussions with Minister Jarkhiholi. There is a campaign going on in the party circles that it is not good when the elections are going on in Telangana. Also, there is a talk that another group which is far away from the Siddaramaiah and DK groups has started camp politics thinking why they should not become the CM. All in all.. It remains to be seen what kind of turn the Karnataka Congress politics of the three factions will take.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube