పెబ్బేరులో డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
పెబ్బేరులో డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
పెబ్బేరులో డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల ప్రారంభం
టీ మీడియా, అక్టోబర్5, పెబ్బేరు : పెబ్బేరు మండల కేంద్రంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ డాక్టర్లు బ్రహ్మారెడ్డి, డాక్టర్ ఎల్ మురళీధర్ ముఖ్య అతిథులుగా హాజరై గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు బీరం రాజశేఖర్ రెడ్డి, కే.సంగీతలు మాట్లాడుతూ ఆంధ్రా రాయలసీమ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి పెబ్బేరులో నూతన బ్రాంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు . బడుగు బలహీన వర్గాలకు ఉన్నత వైద్యం అందించాలనే సంకల్పంతో డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నామన్నారు.
Also Read : మంటగలుస్తున్న మానవ సంబంధాలు
పెబ్బేరు మండల పరిధిలోని గ్రామీణ ప్రజలకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మండల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ యం సృజన్ జనరల్ సర్జన్ డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ కే. గౌతమ్ గుండె శాస్త్ర చికిత్స నిపుణులు, డాక్టర్ పి సుధీర్ గైనకాలజిస్ట్ తదితర వైద్య విభాగాలు ఉన్నాయన్నారు. పెబ్బేరు మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు , పలువు నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube