విజయవాడలో నూతన సిపిఎం రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
టీ మీడియా, ఫిబ్రవరి 13, విజయవాడ : విజయవాడలోని బందరురోడ్డులో నూతన సిపిఎం రాష్ట్ర కార్యాలయం సోమవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి ఈ కార్యాలయాన్ని ఆవిష్కరించారు. సిపిఎం సీనియర్ నేత పి.మధు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంఎ.బేబి మాట్లాడుతూ … ప్రజాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఈ కార్యాలయం ఉంటుందని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే కేంద్రం అని, ప్రజాతంత్ర శక్తులకు ఇదొక వేదికగా ఉంటుందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సిపిఐ రాష్ట్ర నేత జెన్నీ విల్సన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, సీనియర్ నేత పి.మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం నేత సిహెచ్.బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.