నూతన ప్రార్థన మందిర ప్రారంభోత్సవం
– ముఖ్య అతిది గా హజరైన డా.కోట రాంబాబు
టీ మీడియా, నవంబర్ 21, బోనకల్ : బోనకల్ మండలం కలకోట గ్రామంలో ఇటీవల నూతనముగా నిర్మించిన సిలోయం ప్రార్థన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఅరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు హాజరైనారు.ఈ సందర్భంగా డా రాంబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు నేర్పిన ప్రేమ, దయ, జాలి, కరుణ, అన్ని సుగుణలను ప్రతి మనిషి కలిగి వుండాలి అని, సంఘమంతా కలిసి క్రీస్తు మార్గంలో మాదిరి కరంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి,మరియు ఇతర పాస్టర్ లు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.