టీ మీడియా అశ్వరావుపేట డిసెంబర్ 1
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి పుణ్యమా అని విద్యారంగం చతికిలబడిన సంగతి అందరికీ విధితమే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యారంగాన్ని కొంతమంది ఔత్సాహికులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదువుపై ఆసక్తి కలిగేవిధంగా విద్యార్థులను ప్రోత్సాహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్రీ రామకృష్ణ యోగ సమితి సత్తుపల్లి వారి సహకారంతో నారావారిగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నవంబర్ నెలలో పాఠశాల పనిదినాలను బట్టి హాజరైన విద్యార్థుల హాజరుశాతాన్ని ను తీసుకుని అత్యధిక రోజులు 22రోజులు, 21రోజులు,20 రోజులు హాజరైన 20 మంది విద్యార్థిని విద్యార్థులను పేరు పేరునా వారికి కరతాళధ్వనులతో అభినందించారు. చదువు పట్ల ఆసక్తి చూపించిన విద్యార్థులకు పెన్సిల్స్,పెన్నులు,పుస్తకాలు,క్రయిన్స్ లను బహుమతులు గా ఇచ్చి వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు అప్పారావు మాట్లాడుతూ ప్రతి నెల కూడా హాజరు శాతాన్ని బట్టి ఈ విధంగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని అన్నారు.తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకుని ప్రోత్సాహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు సూర్యనారాయణ బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.