అయ్యప్పకు కళ్లుచెదిరే ఆదాయం

-పది రోజుల్లోనే రూ. 53.57 కోట్ల ఆదాయం

1
TMedia (Telugu News) :

అయ్యప్పకు కళ్లుచెదిరే ఆదాయం

-పది రోజుల్లోనే రూ. 53.57 కోట్ల ఆదాయం

-భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసిన దేవస్థానం

-కొనసాగుతున్న మండల పూజల సీజన్

లహరి ,నవంబరు 28,శబరిమల : ఈ ఏడాది మండల-మకరవిలక్కు పూజల కోసం శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరచుకున్నప్పటి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. మండల కాలం దీక్ష పూర్తిచేసుకుని, ఇరుముడితో శబరిమల చేరుకుని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. ఏటా నవంబరు 16న ప్రారంభమైన మకర సంక్రాంతి పూర్తయి జనవరి 20 వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది. ఈ ఏడాది స్వామికి ఆదాయం భారీగా సమకూరుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నవంబరు 16న మండల-మకరవిలక్కు పూజల కోసం తెరుచుకోగా.. ఈ సీజన్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారికి ఆదాయం రికార్డుస్థాయిలో సమకూరుతోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.52.55 కోట్లు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ వెల్లడించారు. ఇందులో సగం ఆదాయం ప్రసాదాల విక్రయం ద్వారా వచ్చిందే కావడం విశేషం. అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్ల ఆదాయం వచ్చినట్లు గోపన్ తెలిపారు. దేవస్థానంలో హుండీల ద్వారా రూ. 12.73 కోట్ల సమకూరినట్టు అనంత గోపన్‌ పేర్కొన్నారు.

Also Read : కార్మికుల అధ్వర్యంలో సూపరింటెండెంట్ కు వినతి

ఇండియా ఫేవరెట్ స్మార్ట్‌ఫోన్ డెస్టినేషన్ | అమెజాన్‌లో బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భలే తగ్గింపు ధరలు గతేడాది ఇదే సమయానికి రూ.9.92 కోట్లు మాత్రమే లభించిందని ఆయన తెలిపారు. వచ్చే 20 రోజులకు సరపడే 51 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయన్నారు. రోజుకు సగటున రెండున్నర లక్షల డబ్బాలు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో ఆలయానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుతున్నారు.ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించిన కేరళ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. టైమ్ స్లాట్ విధానం వల్ల భక్తుల ఎక్కువ సేపు నిరీక్షణ లేకుండా సన్నిధానంలోకి చేరుకుంటున్నారు. అలాగే, దర్శన వేళలను కూడా పెంచారు. గతంలో ఉదయం 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు దర్శనాలను అనుమతించేవారు. రద్దీ నేపథ్యంలో సాయంత్రం దర్శనాలను ముందుకు జరిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అనుమతిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube