తీరుమారని వైద్య సిబ్బంది

 తీరుమారని వైద్య సిబ్బంది

0
TMedia (Telugu News) :

 తీరుమారని వైద్య సిబ్బంది

-నడిగూడెంలో పడకేసిన ప్రభుత్వ వైద్య సేవలు..

-స్థాయి పెరిగిన అందుబాటులోని వైద్యం.

టీ మీడియా, ఆగస్ట్ 6 ,నడిగూడెం :
జిల్లా కలెక్టర్ ఆదేశించిన వైద్య సిబ్బందిలో మార్పు రాలేదని మండలంలోని ప్రజల ఆరోగ్య సేవలు పడకేసేయని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో మండల కేంద్రంలోని వైద్యశాల స్థాయిని పెంచడంతో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అనుకుంటున్న ప్రజలకు నిరాశ మిగిలింది.నడిగూడెం లోని ప్రభుత్వ వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు,సూపరిండెంట్ ఒకరు,ఒక హెడ్ నర్సు , ఐదుగురు నర్సులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు , పదిమంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.వైద్యశాలలో నియమించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

also read:పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.

 

వైద్య సిబ్బంది ఒక సంవత్సరం కాలంగా ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకే వెళ్ళిపోతున్నారని. రాత్రి వేళలో ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యశాలకు వచ్చేసరికి వైద్యశాల మూసి ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వైద్యం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతున్నాయి అన్నారు. పగటివేలలో కూడా వైద్యశాలకు వచ్చిన రోగులకు సరైన మందులు ఇవ్వకుండా లేవని సమాధానం చెబుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగు లకు ఇతర సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవంటున్నారని. అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యశాలలో 24 గంటలు వైద్యశాలలో వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక వారం రోజుల పాటు రాత్రి వేళలో శానిటేషన్ సిబ్బందిని మాత్రమే ఉంచినట్లు సమాచారం శనివారం బృందావనపురం గ్రామం నుండి ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం వైద్యశాలకు తీసుకురాగా రాత్రి 8 గంటలకే వైద్యశాల మూసివేయడంతో తప్పని పరిస్థితులలో వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారని గ్రామస్తలు వాపోయారు.

also read :పవర్ (మేక్) న మజాకా

నడిగూడెం వైద్యశాలలో వైద్యులు అందుబాటులో ఉండి వైద్యం అందించినట్లయితే రోగి బ్రతికే అవకాశం ఉండేది అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలు అందించాలని గత రెండు సంవత్సరాల క్రితం నడిగూడెం మండల కేంద్రంలో గల 16 పడకల స్థాయి గల ప్రభుత్వ వైద్యశాలను సామాజిక ఆరోగ్య కేంద్రం సి హెచ్ సి గా మర్చి 30 పడకల స్థాయికి పెంచారు.మండలంలోని ప్రజలు వైద్యశాల స్థాయి పెంచడంతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశించారు. స్థాయి పెంచడంతో పాటు అందుకు కావాల్సిన వైద్య సిబ్బందిని నియమించక పోవటం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాల స్థాయి పెరగడంతో నిబంధనల మేరకు వైద్యశాలలో 8 నుండి 15 మంది డాక్టర్లును, ఒక ఫార్మసిస్ట్ ను పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియామకం చేసి అన్ని రకాల వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube