జారే అన్న జిల్లా కేంద్రానికి బస్సులు పెంచరూ..

- పల్లెలకు వెళ్ళని పల్లె వెలుగు చక్రాలు

0
TMedia (Telugu News) :

జారే అన్న జిల్లా కేంద్రానికి బస్సులు పెంచరూ..

– పల్లెలకు వెళ్ళని పల్లె వెలుగు చక్రాలు

– ఆటోలనే ఆశ్రయిస్తున్న పల్లె మహాలక్ష్ములు

టీ మీడియా, డిసెంబర్ 14, అశ్వారావుపేట : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే పునర్విభజనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఏర్పడినప్పటికీ ఈ నియోజకవర్గ ఖమ్మం జిల్లాలో ఉండటం వల్ల జిల్లా కేంద్రమైన ఖమ్మంకు వెళ్ళుటకు ప్రయాణికులు ఎవరు కూడా పెద్ద ఇబ్బంది పడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చొరవతో ప్రజలకు మరింత సేవ చేయాలని దృక్పథంతో పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్రంలోని కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి వెళ్ళింది. జిల్లా ఏర్పడిన నాటి నుండి ఏ చిన్న పని అయినా నియోజకవర్గ ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళవలసి ఉండగా ఈ రూట్ లో ఆర్టీసీ సర్వీసు ఎక్కువ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదాహరణకి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి, జిల్లా కోర్టుకు కొన్ని ముఖ్యమైన శాఖల పనుల కొరకు పలువురు నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్ళవలసి ఉంటుంది.

Also Read : టీటీడీకి షాక్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు..

వీరికి సరైన సమయంలో బస్ సర్వీసులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ముఖ్యమైన జిల్లా అధికారులను కలిసే పనిలో ఎన్నోసార్లు స్తోమత లేకపోయినా కారు కిరాయికి పెట్టుకుని వెళ్లిన సందర్భాలు కోకలలో ఉన్నాయి.ప్రతిరోజు ఉదయం గం.9 గంటలకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకే ఇక్కడి నుండి బస్ సర్వీస్ సౌకర్యం ఉంది. ఒక్క ఎక్స్ ప్రెస్ బస్సు కూడా ఇక్కడి నుండి లేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎలాగొల వెళ్లారు అంటే తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ బాధ చెపక్కర్కేదు అలా ఉంటుంది. ఆ బాధ అనుభవించిన వాళ్లు ప్రభుత్వంపై విమర్శలు చేయని వారు ఉండరంటే ఉండరు ఆ విధంగా ఉంటుంది వారి బాధ,ఇదిలా ఉండగా నియోజవర్గంలోని ఎన్నో గ్రామాలకు ఈరోజు వరకు కూడా పల్లె వెలుగు బస్సు ఆ పల్లెలకు వెళ్ళదు. ముఖ్యంగా అశ్వరావుపేట మండలంలో ఈ తరహా గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read : అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి

ఆ పల్లె మహాలక్ష్మి ఇప్పటికీ కూడా ఆటోలను ఆశ్రయించి అధిక డబ్బులు చెల్లించి మండల కేంద్రానికి రావాల్సిందేనా?అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆ పల్లె మహా లక్ష్ములు లకు అందని ద్రాక్షగా ఉండే నా? చూడాలి!గడిచిన పదేళ్లు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు ఇప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన జారే అన్నా బస్సు సర్వీసులపై దృష్టి పెట్టి సత్వరమే పరిష్కారం చూపించే విధంగా చూడాలని ఆయన అభిమానులు, నియోజవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube