భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..
టీ మీడియా, మార్చి1, హైదరాబాద్ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ వినియోగ గ్యాస్‌తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయి. గృహ వినియోగ వంట గ్యాస్‌పై రూ.50 పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ.1,103కు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119కి పెరిగింది. హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1175కి చేరింది. డొమెస్టిక్ గ్యాస్ లిండర్ ధర దాదాపు ఎనిమిది నెలల తర్వాత రూ.50 పెరిగింది. గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు విలవిలలాడుతుండగా తాజాగా పెరిగిన ధరలతో మరింత భారపడనున్నది.