నల్లగొండ సీటు కోసం బీజేపీలో పెరుగుతున్న డిమాండ్

-అధిష్టానం వైపుఅందరి చూపు

0
TMedia (Telugu News) :

నల్లగొండ సీటు కోసం బీజేపీలో పెరుగుతున్న డిమాండ్

-అధిష్టానం వైపుఅందరి చూపు

టి మీడియా, జనవరి 3,నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాక అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా, తిరిగి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యాయి. కేంద్రంలో మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. నల్లగొండ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కేంద్రంలోని కమల దళం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు స్థానంపై దృష్టి సారించిన బీజేపీ, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌ను రంగంలోకి దింపింది. ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న లక్ష్మణ్, కార్యకర్తలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారు.నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీలో డిమాండ్ ఎక్కువగానే ఉంది.

Also Read : 3 రోజులపాటు అంతర్జాతీయ పతంగి పండగ..

చాల మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్లు బలమైన అభ్యర్థి అవుతారని ఆశించారు. అయితే ఆర్థికంగా భారం మోయలేనిదంటూ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇక సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారట. ఇటీవల నల్లగొండకు వచ్చిన జాతీయ నేత డాక్టర్ లక్ష్మణ్‌కు లేఖ కూడా ఇచ్చారట. ఈయన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నప్పుడు సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి తిరిగి బీజేపీలో చేరారు. పార్టీలు మారినప్పటికీ ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని వ్యక్తిగా గుర్తింపు ఉంది. పార్టీలో కూడా అందరితో మంచిసంబంధాలనుకొనసాగిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జితేంద్ర కుమార్ ఈసారి కూడా టికెట్ రేసులో ఉన్నారు.ఇదిలావుంటే, నల్గొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర రైతు మోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన గోలి మధుసూదన్ రెడ్డి కూడా ఎంపీగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ విద్యార్థి దశ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. పార్టీ తోపాటు దాని అనుబంధ సంఘాలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులతో వీరికి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

Also Read : సన్నబియ్యం ధరలకు రెక్కలు..

గతంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని నూకల నరసింహారెడ్డి భావించినప్పటికీ పార్టీ అవకాశం ఇవ్వలేదట. నల్లగొండ పార్లమెంటు బరి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే, నూకల నరసింహారెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారే తమకు టికెట్ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు ఈసారి పార్టీ ఆదేశిస్తే పోటీకి సై అంటున్నారట.మరోవైపు నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కొంత కాలంగా పార్టీ పార్లమెంటు విభాగం ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట. నల్గొండ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థులు అరడజను మంది వరకు పోటీ పడుతున్నప్పటికీ.. ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి..!

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube