కొనసాగుతున్న అంగన్వాడి కార్యకర్తల నిరవధిక సమ్మె

కొనసాగుతున్న అంగన్వాడి కార్యకర్తల నిరవధిక సమ్మె

0
TMedia (Telugu News) :

కొనసాగుతున్న అంగన్వాడి కార్యకర్తల నిరవధిక సమ్మె

టీ మీడియా, డిసెంబర్ 29, మహానంది: మహానందిలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 18 రోజులకు చేరుకుంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే సమస్యల పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని, తమ న్యాయమైన కోరికలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సావిత్రి, నారాయణమ్మ, జ్యోతి ఉషారాణి, గౌరీ,చండీ దేవి, మహేశ్వరి, పుష్పకళ, లక్ష్మి, ఖైరున్ , కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube