అత్య‌ధిక క్ష‌య‌వ్యాధిగ్ర‌స్థులు ఇండియాలోనే

అత్య‌ధిక క్ష‌య‌వ్యాధిగ్ర‌స్థులు ఇండియాలోనే

0
TMedia (Telugu News) :

అత్య‌ధిక క్ష‌య‌వ్యాధిగ్ర‌స్థులు ఇండియాలోనే

– డ‌బ్ల్యూహెచ్‌వో

టీ మీడియా, నవంబర్ 9, న్యూఢిల్లీ: అత్య‌ధిక సంఖ్య‌లో క్ష‌య కేసులు ఇండియాలోనే న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. 2022లో భార‌త దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఇండియాలోనే 27 శాతం టీబీ కేసులు ఉన్న‌ట్లు గుర్తించారు. మొత్తం 28.2 ల‌క్ష‌ల కేసులు ఉన్నాయ‌ని, దాంట్లో 12 శాతం అంటే 3.42 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధికి బ‌లైన‌ట్లు రిపోర్టులో తెలిపారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్ర‌కారం.. 30 దేశాల్లో 87 శాతం టీబీ కేసులు ఉన్న‌ట్లు తేలింది. భార‌త్ త‌ర్వాత అత్య‌ధిక టీబీ కేసులు ఉన్న దేశాల్లో ఇండోనేషియా(10 శాతం), చైనా(7.1 శాతం), పిలిప్పీన్స్‌(7 శాతం), పాకిస్థాన్(5.7 శాతం), నైజీరియా(4.5 శాతం), బంగ్లాదేశ్‌(3.6 శాతం), కాంగో(3 శాతం) ఉన్నాయి.

Also Read : సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి హరీశ్‌ రావు

అయితే భార‌త్‌లో క్ష‌య‌వ్యాధి కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చిన‌ట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 2015లో ప్ర‌తి ల‌క్ష మందిలో 258 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తులు ఉండేవారు, అయితే 2022 నాటి ఆ సంఖ్య 199కి ప‌డిపోయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న రిపోర్టులో తెలిపింది. కానీ ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే చాలా ఎక్కువే ఉన్న‌ట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube