భారత్‌ నాలో ఒక భాగం : సుందర్‌ పిచాయ్‌

భారత్‌ నాలో ఒక భాగం : సుందర్‌ పిచాయ్‌

1
TMedia (Telugu News) :

భారత్‌ నాలో ఒక భాగం : సుందర్‌ పిచాయ్‌

టీ మీడియా, డిసెంబర్ 3, శాన్ ఫ్రాన్సిస్కో : భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ్ అవార్డును ఆయన తాజాగా అందుకున్నారు. 2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్‌కి అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ..

Also Read : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ గౌరవం నాకు కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత్‌ నాలో ఒక భాగం. ఎక్కడికెళ్లినా ఆ వారసత్వాన్ని నాతోనే తీసుకెళ్తా. నా తల్లిదండ్రులు, నా ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని పిచాయ్‌ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube