గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియ‌న్ ఆర్మీ

గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియ‌న్ ఆర్మీ

0
TMedia (Telugu News) :

గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియ‌న్ ఆర్మీ

టీ మీడియా, మార్చి 4, శ్రీన‌గ‌ర్‌ : ఇండియా, చైనా బోర్డ‌ర్ మ‌ధ్య ఉన్న గాల్వాన్ లోయ అత్యంత సున్నిత‌మైన ప్ర‌దేశం. రెండేళ్ల క్రితం ఆ ప్ర‌దేశంలో రెండు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఉద్రిక్త‌త చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అక్క‌డ భార‌త ఆర్మీ త‌న సైన్యాన్ని పెంచింది. గాల్వాన్ వ్యాలీలో ఉన్న సైనిక ద‌ళాలు ర‌క‌ర‌కాల క్రీడ‌లు ఆడుతూ ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. ఇండియ‌న్ ఆర్మీబృందంలో గాల్వాన్‌లో క్రికెట్ ఆడుతున్న దృశ్యాల‌ను రిలీజ్ చేశారు. హై ఆల్టిట్యూడ్‌లో ఉన్న ఈ ప్రాంతాల్లో ప్ర‌స్తుతం అతిశీత‌ల వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. అతి క‌ష్టంగా ఉండే ఆ వెద‌ర్‌లోనూ సైనికులు త‌మ క్రీడా స‌త్తాను చాటుతున్నారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కూడా ఇండియ‌న్ ఆర్మీ త‌మ అశ్వ‌ద‌ళాల‌ను బ‌లోపేతం చేస్తోంది. గుర్రాలు, పోనీలతో ప‌హారా కాస్తున్నారు. గ‌డ్డ‌కట్టుకుపోయిన ప్యాంగాంగ్ స‌ర‌స్సులో కూడా హాఫ్ మార‌థాన్ నిర్వ‌హిస్తున్నారు.

Also Read : ప్రభుత్వ చమురు డిపోలో పేలుడు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube