ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

-దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం

టీ మీడియా, నవంబర్ 26, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో 26 నవంబర్ 2022 భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని కర్రెమ్మ గుడి దగ్గర దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటితో భారత రాజ్యాంగ దినోత్సవం 72 వసంతాలు పూర్తి చేసుకుంది. మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహామహులు అందరూ వారి ప్రాణాలను త్యాగం చేసి స్వతంత్రాన్ని సాధించారు. అట్టి స్వతంత్ర భారతానికి ఒక పవిత్రమైన రాజ్యాంగం పరిపాలన విధానం రూపొందించుటకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడింది.

Also Read : డిసెంబర్‌, జనవరిలో శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు

రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరము శ్రమిస్తూ రాజ్యాంగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచం కీర్తించే విధంగా ఘనపరిచే విధంగా గుర్తించే విధంగా గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి అంకితం చేసిన నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం భారతదేశ పరిపాలన విధానానికి చుక్కాని వంటిదే భారత రాజ్యాంగం పౌరుల యొక్క హక్కులు విధి విధానాలు పరిపాలన పద్ధతులు తదితర అంశాలు ఎన్నో రూపొందించి చక్కని భారత రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ యావత్ జాతి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని దళిత అభివృద్ధి సంఘం నేతలు కొనియాడారు.

భారతదేశంలో ప్రతి సామాజిక వర్గానికి కూడా స్వేచ్ఛ సమానత్వం లభిస్తుంది అంటే అందుకు కారణం భారత రాజ్యాంగం ఎంతో దూర దృష్టితో ఆలోచన చేసినాడు భారత రాజ్యాంగ రూపకర్తలైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు అన్ని కులాల వారికి నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, వాటాలు లభించే విధంగా అందరికీ ఆమోదమయ్యే రాజ్యాంగాన్ని రూపొందించి జాతికి అంకితం చేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దళిత అభివృద్ధి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి,ఉపాధ్యక్షులు జిటి శ్యామ్, కోశాధికారి బంకలి ఆంజనేయులు,కార్యవర్గ సభ్యులు ఈర పోగు రవి, విజయ్ బాబు, డి. మహేష్, కేశవులు, నారాయణ, రామకృష్ణ, కొండలయ్య, వెంకటేశు ,రామదాసు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube