ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 27, భద్రాచలం

ఈరోజు డిసెంబర్ 27న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరళ్ళ నరేష్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే పొదేం వీరయ్య చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, అలాంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి వారి త్యాగాల గురించి ఈరోజు వారిని స్మరించుకుంటూ

ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నా చేతుల మీద గా జరగటం ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు,బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో విసిగి, వేశారి పోతున్న ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగించినటువంటి గాంధీ మహాత్ముడు, సరోజినీదేవి లాంటి వారిని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకోవడం వారి యొక్క ఘనత మనందరిలో స్ఫూర్తి నింపుకోవడం వారి ఆశయ సాధనకు మనందరం కృషి చెయ్యాలి అని ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, ఐ ఎన్ టి సి మాజీ అధ్యక్షులు కృష్ణార్జున రావు గారు,మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు సుధీర్, ప్రదీప్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంధం శ్రీనివాస్ గౌడ్,అడబాల వెంకటేశ్వర్లు, గండేపల్లి హనుమంత్, రాగం సుధాకర్, సరేళ్ళ వెంకటేష్, ఉబ్బ వేణు, వంశీ, కిషోర్, సోషల్ మీడియా ఇంచార్జ్లు తరుణ్ మిత్ర, మహిమ్మద్ ఖాన్, మైనార్టీ సెల్ నాయకులు అరీఫ్, అహ్మద్, అర్జున్, తదితరులు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో లో ఉన్నారు.

Indian National congress party Emergency day.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube