ఉక్కు మహిళా స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,19, భద్రాచలం

భారత దేశ తొలి మహిళా ప్రధాని,ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా భద్రాచల మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్ ఆధ్వర్యంలో ఈరోజు సెంటర్ నందు గల ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం నరేష్ మాట్లాడుతూ పేదల గుడిసెలను ఇల్లు గా మార్చిన వ్యక్తి,పెద్దల బ్యాంకులను పేదలకు వరం చేసిన వ్యక్తి, దేశాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేసిన వ్యక్తి, దేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి మన ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్,బొలిశెట్టి రంగారావు,బంధం శ్రీనివాస్ గౌడ్, హనుమంతు,సాయి బాబా,అర్జున్,కోణాల జయరాజు,చారి,మహిళా కాంగ్రెస్ నాయకులు దేవకీ,రాగం సుధాకర్,మాగాపు రాజు,భాగిశెట్టి మహేష్, శేషు,సరేళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Iron lady pays rich tribute on the occasion of the late Indira Gandhi Jayanti.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube