ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 19, వెంకటాపురం :

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎంపీపీ చెరుకూరి సతీష్ పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సతీష్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని గాంధి జననం 19 నవంబర్ 1917 న జన్మించగా, 31 అక్టోబర్1984 లో మరణించారు. భారత దేశపు మొట్ట మొదటి ఏకైక ప్రధానమంతి. ఆమే 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధాన మంత్రిగా పనిచేసారని, భారతీయురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు సీతాదేవి, రవి, పిఎసిఎస్ డైరెక్టర్ పల్నాటి ప్రకాష్ రావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Glorious Indira Gandhi Jayanti celebrations.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube