ఇండోర్ స్టేడియంను అందుబాటులోకి తేవాలి

ఇండోర్ స్టేడియంను అందుబాటులోకి తేవాలి

0
TMedia (Telugu News) :

ఇండోర్ స్టేడియంను అందుబాటులోకి తేవాలి

టీ మీడియా, మార్చి12, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విలేఖరి శేఖర్ స్మారక షటిల్ టోర్నమెంట్ను మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ బ్యాట్ కాక్ అందించి శినివారం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షటిల్ ప్లేయర్స్ వనపర్తిలో చాలామంది ఉన్నారు. కానీ వారికి ఇండోర్ స్టేడియం చాలా దూరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర ఉంది. అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు కావున వనపర్తి జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీలో ఇండోర్ స్టేడియం కలదు. ప్రస్తుతం మున్సిపాలిటీని వెంటనే వారి సొంత భవనాన్నికి మార్చి వెంటనే క్రీడాకారులకు ఇవ్వగలరని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు భాను, శ్యామ్, సంజీవయ్య, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : లోక్ అదాలత్ లో 48 కేసులు పరిష్కారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube