వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ

0
TMedia (Telugu News) :

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ

లహరి, అక్టోబర్ 29, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగింది. శనివారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం(ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించి, కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు బచ్చు మాధవీ కృష్ణ, కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి పి.చంద్ర శేఖర్, ఆలయ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయంనకు చేరుకున్నారు.

Also Read : ‘ఇండియా’ తొలగింపు ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదు

గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube