విద్యార్థుల క్షేత్ర పర్యటన

0
TMedia (Telugu News) :

విద్యార్థుల క్షేత్ర పర్యటన

టీ మీడియా, మార్చి 10, బీరుపూర్ :

జగిత్యాల జిల్లాలోని, బీరుపూర్ మండల కేంద్రంలో గల స్థానిక, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న, 8 వ తరగతి ఆ సామాన్యులు అనే పాఠ్యంశంలో భాగంగా, విద్యార్థులకు అవగాహన కోరకు, విద్యార్థులను క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు రంగ శ్రీనివాస్, పేరి మంజునాథ్, జెడ్పిఎచ్ఎస్ బీరుపూర్ పాఠశాల విద్యార్థులు, క్షేత్ర పర్యటనకు వెళ్లడం జరిగింది.

ALSOREAD:కళామందిర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి & యాంకర్ అనసూయ .

 

తదనంతరం తెలుగు భాష అధ్యాపకుడు రంగ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తరగతి గదిలో విద్యార్థులకు బోధించడం ద్వారా వినడం, చూడడం, పుస్తక పఠనం, మాత్రమే ఉంటాయి అని విద్యార్థులను క్షేత్ర స్థాయిలో పర్యటనకు తీసుకుని వెళ్లడం ద్వారా ప్రయోగాత్మక అంశాలను, ప్రయోగాత్మకంగా వివరించడం ద్వారా, విద్యార్థులకు పాఠ్యంశంపై మరింత అవగాహన కలుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో, పర్యటనకు వెళ్లడం ద్వారా కఠినమైన అంశాలు కూడా సులభంగా అర్థం అవుతాయి అని, బీరుపూర్ మండల కేంద్రంలో గల స్థానిక, కుండల తయారీపై, కుమ్మరి అముపై కుండల తయారీ విధానాన్ని, ఎలా తయారు చేస్తున్నారో అని స్వయంగా క్షేత్ర పర్యటనకు వెళ్లి చూడడం ద్వారా, మరింత అవగాహన కలిగింది అని తెలిపారు.

ALSO READ:అనుమానస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

పలు పాఠ్యంశాలపై, క్షేత్ర స్థాయిలో క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా, మరింత విజ్ఞానాన్ని, మరింత సమాచారం, తెలుసుకోవడం సులభతరం అవుతుంది అని తెలిపారు. క్షేత్ర పర్యటనకు వెళ్లిన అధ్యాపకులను, విద్యార్థిని, విద్యార్థులను, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube