బొమ్మ గిదేందమ్మా

ఇళ్ల మధ్యనే ఇండస్ట్రీ

0
TMedia (Telugu News) :

బొమ్మ గిదేందమ్మా

– ఇళ్ల మధ్యనే ఇండస్ట్రీ

– భాధ నుండీ విముక్తి కోసం వేడుకోలు

– కహానీలు చెప్తున్నా కనికరం లేని అధికారులు

టి మీడియా, డిసెంబర్ 20, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ కార్పొరేషన్ పాలక పక్షం నిర్లక్ష్యాలు, అధికారుల అలసత్వం, కొంతమంది కాసుల కక్కుర్తి వెరసి నగర ప్రజల నరక యాతన జీవితం కు కారణం అవుతున్నాయి. ఇళ్ల మధ్య భారీపరిశ్రమలు ఏర్పాటు చేసి కాలుష్యం వేదజల్లుతున్నా..పట్టనట్లు గా ఉన్నారు.. బోనకల్ రహదారి లో ఉన్న శ్రీరాం నగరవాసులు సుమారు 200ల మంది అక్కడి బొమ్మ రాజేశ్వరరావు అనే వ్యక్తీ రైస్ మిల్లు బాధితులు సంఘంగా ఏర్పడటం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. చర్యలు చెప్పట్టాల్సిన మున్సిపల్ అధికారులు కహనీలు చెపుతున్నారు. రైస్ మిల్లు యాజమాని రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల అధికారులు అతనికి అండ నిస్తున్నారు. కాసుల కక్కుర్తి కూడా ఉన్నట్లు గా సమాచారం. మిల్లు కు చెందిన వరిపొట్టు లాంటివి ఇళ్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆధునిక పరికరాలు వాడే విధంగా చర్యలకు ఆదేశించక పొగ ఇల్లు వదిలి వెళ్లిపోండని ఉచిత సలహ ఇస్తున్నారని బాధితులు వాపోయారు.

Also Read : పీఠంపై నువ్వా..నేనా.

నగరం లో పరిశీలన చేస్తే..
కిన్నెర ఆస్పత్రి వెనుక ఇళ్లమధ్యన మున్సిపల్ ఉద్యోగి ఐస్ ఫ్యాక్టరి
నడుపుతున్నాడు. శాంతినగర్ స్కూల్ వేనుక ప్రక్కన భారీ పల్లి విత్తనాలు పరిశ్రమ ఉంది. పాత మున్సిపల్ ఎదురుగా, స్టేషన్ రోడ్, బొమ్మ నా సెంటర్ కి వెళ్లే మార్గాల్లో పెద్ద, పిండి, కారం మిల్లులు ఉన్నాయి. మూడవ టౌన్ గాంధీ నగర్ లో కుటిర పరిశ్రమల పేరుతో అనేక కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. షాదీఖానా ఎదురుగా ఉన్న బేకరీ యాజమాన్యం వెనుక ఉన్న పాత భవనం లో బేకరీపదార్థ లు తయారు చేసే పెద్ద కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసిపెద్ద పొగ గొట్టం ఏర్పాటు చేసింది.. మామిళ్లగూడెం, సారధి నగర్, పాకబండ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్య లో కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి కనీసం మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు లు కూడా లేవు.. వీటి అన్నింటి నుండి కొంతమంది మున్సిపల్ సిబ్బంది కి, రాజకీయవేత్త లకు ఈ అక్రమ వ్యవహారంలో మాముళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ అవినీతి కి నిదర్శనంగా ఈ వ్యవహారాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube