పారిశ్రామిక శిక్షణా కేంద్రంకు ప్రతిపాదనలు ఇవ్వండి
-కలెక్టర్ కృషి అభినందనీయం
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
టి మీడియా, ఎప్రిల్ 21,భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెంలో మోడ్రన్ శిక్షణా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, స్కిల్ డవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం రుద్రంపూర్ ఐటిఐని సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు కేంద్రం సహాయ సహాకారాలు అందిస్తుందని చెప్పారు. మూరుమూల ప్రాంతాలున్న ఈ జిల్లాలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు వృత్తి నైపుణ్యతా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఇంకో 25 సంవత్సరాలైతే 100 సంవత్సరాలు అవుతుందని దానిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రానున్న 25 సంవత్సరాలల్లో దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయని, కానీ భారతదేశం మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించినట్లు చెప్పారు. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా 1.8 బిలియన్ వాక్సిన్లు వేసిన ఘనత భారతదేశానికి దక్కిందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : శవరాజకీయాలకు స్వస్తిపలకండి
ఇప్పటికి చైనా దేశంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఐటిఐ చేసిన విద్యార్థులకు వివిద ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలుంటాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్దులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటిఐలో ఉన్న కోర్సులు, విద్యార్ధుల ప్లేస్ మెంట్స్ తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన యాస్పిరేషనల్ పారామీటర్లుపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన 112 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషనల్ జిల్లాలుగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. యాస్పిరేషనల్ జిల్లాలలో ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, ఉపాధి రంగాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. పాఠశాలల స్థాయి నుండి విద్యార్థులకు ఉపాధి కల్పనా రంగాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు స్కిల్ డవలప్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహణకు నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. భద్రాద్రి జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్నందున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో విద్యా, వైద్య, అంగన్వాడీ, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించడం పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రజలకు సర్వీసులు చేరాలని ఆయన సూచించారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంతో పాటు తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉన్న చర్ల మండల ప్రజలకు వైద్య సేవలందించేందుకు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మాతాశిశు ఆరోగ్య కేంద్రంగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
Also Read : కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ను ప్రారంభించిన మేయర్
చర్ల మండలంలో మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల సుదూర ప్రాంతమైన భద్రాచలం వరకు వైద్య సేవలకు రావాల్సిన అవసరం తగ్గిపోతుందని, తద్వారా తల్లీ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. చుట్టు ప్రక్క రాష్ట్రాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో వస్తాయని ఆయన తెలిపారు. అనంతరం యాస్పిరేషనల్ అంశాలలో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి మంత్రి పోషణలోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలను అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అనుదీప్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి విజేత, జడ్పీ సీఈఓ విద్యాలత, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube