సంకుచిత్వం…భావ దారిద్యం..

నా'మా'ట-11

1
TMedia (Telugu News) :

సంకుచిత్వం…భావ దారిద్యం..

 

నా’మా’ట-11
–––———
గాంధీ, నెహ్రూ పక్కన
మీ బొమ్మలు ఉండాలే…
పోలీస్ స్టేషన్ల మా ఫొటోలు ఉండాలే…
మీరు సల్లంగుండాలే..
బాబు…హాయిగుండాలే…

గోరటి వెంకన్న పాట వింటుంటే.. వ్యవస్థల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.
పాటకు అంత ప్రాధాన్యత ఉంది. ఉద్యమానికి గొంతకునిచ్చేది పాటే. ఆ పాటే లేకుంటే బక్కజీవి నుండి ప్రెసిడెంట్ దాకా సమస్యలు తెలిసేవే కావు. స్వయం పోషక జీవి నుండి పరాన్న జీవి వరకు తెలిసేదే కావు. అందుకే పాటలు రాయడానికి ప్రయత్నిస్తంటాను.
ఫోన్ మోగుతుండే సరికి పక్కకు దిరిగి ఫోన్ లిప్ట్ చేశాను…
అర్జంట్‌గా వైరా రోడ్‌లోని ఆసుపత్రికి వద్దకు రా అంటూ ఫోన్ పెట్టేశాడు. ఎందుకు
అని అడుగుతుండగానే ఫోన్ కట్ అయింది. పాట రాయడం ఆపేసి హడావుడిగా
బయలు దేరి ఆసుపత్రికెళ్లేసరికి చాలా మంది కవులు అక్కడనే ఉన్నారు. జరిగింది. తెలుసుకున్నాక బాధతో పాటు ఆందోళన కలిగింది. కష్టజీవికి ఇరు వైపులా ఉండే కవులే నీరసపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అనుకుంటూ అక్కడ నుండి బయులుదేరాను.
‘కవులు అనధికార శాసనకర్తలు’ అని విన్నాను. ఆత్మన్యూనతా భావం,
సంకుచిత స్వభావంతో ఉంటారని ఎప్పుడూ అనిపించలేదు. జరుగుతున్న సంఘటనలు మాత్రం వాటికి నిదర్శనంగానే ఉన్నాయి.

Also Read : సామాజిక రుగ్మతలకు సాహిత్యం కళలే పరిష్కారం

ఓసారి దళిత వాడల సమగ్రాభివృద్ధికి ఇతర సామాజిక వర్గానికి చెందిన
నాయకుడొకరు సైకిల్ యాత్ర చేపట్టారు. ఓ గ్రామానికి వచ్చిన సందర్భంలో అక్కడ
వున్న దళిత సంఘాల నాయకులు సైకిల్ యాత్ర చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించారు. మా సమస్యలు పరిష్కారానికి మేము యాత్ర చేయాలి. మీరు చేస్తే ఎలా అంటూ ప్రశ్నిం
చేసరికి అక్కడనే ఉన్న నాకు ఏమీ పాలుపోలేదు. యాత్ర చేయొద్దనేది వీరి ఉద్ధేశమా లేక
యాత్ర చేస్తున్న వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు అలా అడిగారా అనుకుంటూ
నాకు నేనే ప్రశ్నలు వేసుకున్నాను. నేను అనుకున్నట్లుగానే యాత్ర చేస్తున్న వ్యక్తి
కూడా అదే సమాధానమిచ్చారు.
సమాజంలో అస్తిత్వ పోకడలు పెరిగాక ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి పోరాడాలనేదే అస్తిత్వవాదుల వాదన. ఇది ఎంతవరకూ
సరైంది కాదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…ఇటీవల కవుల్లో ఈ ఫెడధోరణలు పెరిగాయి. ఫలానా సంఘానికి చెందిన కవులు వారి సమావేశాలకే
హాజరు కావాలి. ఇతర సంఘాల సమావేశాలకు హాజరు కాకూడదనే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు
కవుల్లో ఎక్కువయ్యాయి. ఇంకో భావ దారిద్య్రం ఏంటంటే…మన కులస్తులే మన
కవితా సమావేశాలకు రావాలి. ఇతర కులస్తులు రాకూడదు. మనం వెళ్లకూడదు అనే
నిబంధనలు పెట్టి కవులను బావిలో కప్పల్లా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న సంఘటనలు
ఈ మధ్య కాలంలో మితిమీరాయి.

Also Read : ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కవి విశ్వనరుడు. కష్టజీవికి అండగా, పాలకులకు నిర్దేశనంగా కవులు
ఉండాలి. అలాంటిది పోయి పాలకులకు వంత పాడే కవులు ఎక్కువైపోతున్నారనే
బాధ దహిస్తున్న ఈ సందర్భంలో ఇలా కులానికో సంఘం పెట్టుకుంటూ కవుల్లోనూ
కులపిచ్చిని ఎక్కిస్తున్న వైనం క్షమింపరానిది. ఇలాంటి వాటికి దూరంగా ఉండకుండా
వారిలో ఆ కుటిలత్వాన్ని, అస్తిత్వ వాదాన్ని చెరిపేసేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.
ఆసుపత్రి నుండి వచ్చాక పాట పూర్తి చేద్దామని మళ్లీ సగం రాసిన
పేపరందుకున్నాను. మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి ఏమైందనుకుంటూ ఫోన్ లిప్ట్
చేశాను. మేడే సందర్భంగా నిర్వహిస్తున్న కవితాగానానికి హాజరు కావాల్సిందిగా
ఆహ్వానం పలికారు అవతల వ్యక్తి. వివరాలు తెలుసుకున్నాక సరే అంటూ ఫోన్ పెట్టేశాను. ఇప్పుడిక పాట రాయడం సాధ్యం కాదులే అనుకుంటూ మే డే సందర్భం
గా కవిత రాద్దామనుకుని మనసు ఆలోచించసాగింది.
ఎన్ని కాగితాలు రాసినా కొత్తదనం రావడం లేదు. పక్కన పెట్టేశాను. మనసంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు వస్తుంటాయి. పొద్దుటి నుండి
అనేక భావాల సారాంశం మెదడు లోకి ఎక్కేశాక మొద్దుబారిపోయి చురుకుగా కదలనే కదలదు. కవిత రాయడం ఆపేశాను.

Also Read : బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయి తప్పా

ఫోన్ మోగుతుంటుంటే చిరాకేసింది. రోజులో మూడో వంతు ఫోన్‌కే
కేటాయించాల్సి వస్తోంది. నిత్యావసర వస్తువు కదా. ఉల్లిగడ్డ కిలో వందకు
పోయినప్పుడు కూరలో వాడడం మానేసిన మనిషి ఫోన్ నెట్‌బిల్ మాత్రం పడావు
పడకుండా ఖర్చు పెట్టడం గమనార్హం. అలాంటి వారిలో నేనూ ఒకడినే అనుకోండి.
వృత్తి రీత్యా, అవసరాల రీత్యా ఫోన్ వాడితే ఫర్వాలేదు. పనీ పాట లేకుండా ఖాళీగా
కూర్చొని ఫోన్‌తోనే గడుపుతుంటారు కొందరు. అలాంటి వారి వల్లనే మొబైల్
ఛార్జీలు పెరిగిపోయాయి. ఇదే విషయమై ఇటీవల ఓ మిత్రుడిని కదిపితే…ఇదంతా
పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న విశాననం అన్నాడు. ప్రజలకు పాలకులు ఉచిత ప
థకాలతో పాటు పనులూ కల్పిస్తే ఇక జులాయిగా ఫోన్తో గడపాల్సిన అవసరం ఉం
డదు కదా అన్నాడు. ఇదీ వాస్తవమే.
మీరు పాట రాయడమేంటి, ఆసుపత్రికెళ్లి వచ్చాక కవులను విమర్శించడమేంటి, ఇప్పుడీ సెల్‌పోన్ గురింటి సోది ఏంటి అని అనుకుంటున్నారా…ఒక్కోసారి తప్పదు. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్‌ను కదిపేకంటే ఇలాంటి
రాతలు చదవడం కొంత నయమే కదా…
ఫోన్ మళ్లీ మళ్లీ మోగుతుండేసరికి లిఫ్ట్ చేయక తప్పలేదు. విలేకరి నౌకరి
కదా. నడిఎండలో ప్రెస్‌మీట్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాను. మే డే
కవిత రాయడం మీరైనా ప్రారంభించండి.

– నామా పురుషోత్తం
9866645218

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube