మృతుల కుటుంబాలకు అండగా మంత్రి పువ్వాడ

-ఆర్థికసాయం అందజేసిన పి ఎ రవికిరణ్

0
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలకు అండగా మంత్రి పువ్వాడ

-ఆర్థికసాయం అందజేసిన పి ఎ రవికిరణ్

టీ మీడియా,జనవరి 20,ఖమ్మం : నియోజకవర్గం రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సింగి ప్రవీణ్ కుమార్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అందించే 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పి ఎ చిరుమామిళ్ల రవికిరణ్ అందజేశారు. అనంతరం వాంకుడోతండాకు చెందిన పార్టీ కార్యకర్త ధరావత్ భావసింగ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి 5వేల రూపాయల ఆర్థికసహయాన్ని అందజేశారు.

  Also Read : జర్నలిజం కు నకిలీ మరక

ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మీరా,అమలి నాయకులు మోహన్ రావు,మండదపు,నర్సింహారావు,అప్పారావు,వెంకటరమణ,రమేష్,రాజేష్,సంతు,తారా చంద్,పంతులు, కోట్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube