వరి మోపుతో వినూత్న నిరసన

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 18 వనపర్తి : యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ లో గురువారం మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు దగ్గర ఏర్పాటు చేసిన మహాధర్నాలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని వరి మోపు తో వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి రైతుల నడ్డివిరిచే విధంగా వ్యవహరిస్తూ తెలంగాణలో అత్యధికంగా దిగుబడి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మోసం చేసిందంటూ అందుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

Innovative protest with rice mop.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube