ముంపు ప్రాంతాలను పరిశీలన

ముంపు ప్రాంతాలను పరిశీలన

1
TMedia (Telugu News) :

ముంపు ప్రాంతాలను పరిశీలన

టిమీడియా,జూలై20,గిద్దలూరు:
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం లోని సగిలేరు వాగు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి మరియు సభ్యుల బృందం.వాగు ప్రవాహనికి ప్రధాన అడ్డంకి వాగులో ఏపుగా పెరిగిన కంప చెట్లు మరియు వ్యర్ధాలని సభ్యుల బృందం ప్రాథమికంగా అభిప్రాయపడింది.ఈ కంప చెట్ల తొలగింపు ప్రక్రియను గిద్దలూరు నగర పంచాయతీ వారు అత్యంత వేగంగా చేయాలని కోరారు.

 

Also Read : పట్టాలెక్కని పేదల రైళ్లు

ఈ సగిలేరు వాగు అభివృద్ధి కోసం ఇప్పటి వరకూ మంజూరైన నిధుల కేటాయింపులో మరియు వాటి ఖర్చు విషయం లో ఏదో అవినీతి జరిగిందని సందేహం వ్యక్తం చేశారు. వాగు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పలనాటి మహబూబ్ పిర, రాష్ట్ర గౌరవ సలహాదారులు జె బాలయ్య యాదవ్, గిద్దలూరు టౌన్ గౌరవాధ్యక్షులు షేక్ మౌలాలి, టౌన్ అద్యక్షులు అజాద్ ఖాన్ పఠాన్, కార్యవర్గ సభ్యులు ఓబులేసు, వెంకటేశ్వర్లు, రంగ స్వామి, రవి, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube