రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
టీ మీడియా, జనవరి 28, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో జరుగుతున్న అటువంటి రోడ్డు విస్తరణ పనులను శినివారం మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఆశిష్ సంగ్వాన కొత్త బస్టాండ్ రోడ్డును వెంటనే విస్తరణ చేపట్టాలని షాప్ షాప్ తిరిగి తెలియజేశారు.
రోడ్డు సెంటర్ నుండి 45 పీట్లు మార్కౌట్ ఇవ్వడం జరిగిందని దాని ప్రకారంగా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఎవరికి వాళ్లు రోడ్డు విస్తరణ చేసుకొని మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాత బజార్, యూకో బ్యాంక్, రామ టాకీస్ నుండి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయడం జరిగిందని వెంటనే మిగిలిపోయిన కొత్త బస్టాండ్ రోడ్, కొత్తకోట రోడ్డు విస్తరణ పనులు వేగం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల యజమానులకు రోడ్డు విస్తరణ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..
వనపర్తి జిల్లా కేంద్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని దీనితోపాటు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దయచేసి ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతగా తీసుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మున్సిపల్ డి ఈ భాస్కర్, ఏపీఎస్ సెక్షన్ సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube