ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ ప్రేమా….

ప్రియుడి ప్రేమ కోసమే.. భర్త హత్య

1
TMedia (Telugu News) :

ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ ప్రేమా….

ప్రియుడి ప్రేమ కోసమే.. భర్త హత్య

టి మీడియా,ఆగస్ట్ 23,రామగుండం:

6 సార్లు హత్యకు ప్రయత్నం చేసిన కీ లేడి…
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు…
పథకం ప్రకారమే ప్రియుడుతో కలిసి హత్య
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రూపేష్…
ప్రియుడి ప్రేమ కోసమే కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నాలు చేసిన కీ లేడి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుసార్లు చంపడానికి ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనంగా మారిన గంగనగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు రాజేందర్ హత్య కేసు నిందితులను సోమవారం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.

 

Also Read : ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

 

ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డీసీపీ రూపేష్ వెల్లడించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ… చిన్నూరు మండలం కృష్ణంపేట గ్రామానికి చెందిన బంధం రాజు,మృతుడి భార్య రవళి పదో తరగతి వరకు చదువుకున్నారు.వీరికి ఇంస్టాగ్రామ్ ద్వారా మరల పరిచయం ఏర్పడింది. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తన భర్త ఉండగా పెళ్లి చేసుకోవడం వీలు కాదని నిర్ణయించుకొని ఎలాగైనా తన భర్తను చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేందర్ యొక్క డ్యూటీలకు వెళ్లే సమయాలను తెలియజేసింది. దీంతో బంధం రాజు గ్రామస్తుడైన సయ్యద్ గులాం తన కిరాణా షాప్ కు వచ్చిన సమయంలో తన ప్రేమ గురించి చెప్పి రాజేందర్ ను చంపడానికి సహాయం చేసినట్లయితే జీవితాంతం రుణపడి ఉంటానని తెలపడంతో ఎలాగైనా చంపాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మొదటిసారి రాజేందర్ రాత్రి డ్యూటీకి వెళ్లే సమయంలో బండరాయితో కొట్టి చంపే ప్రయత్నం చేయగా అది విఫలమైంది. దీంతో రెండోసారి మృతుడి భార్య రవళి కృష్ణంపేటకు వచ్చిన సమయంలో గోదావరిఖని గంగా నగర్ లో రాజేందర్ ఇంటికి రాజు, సయ్యద్ లు కలిసి వెళ్లి కరెంట్ షాక్ పెట్టి చంపే ప్రయత్నం చేసిన మరల విఫలం కావడంతో బంధం రాజు కిరాణా షాపుకు సయ్యద్ స్నేహితులు వాజిద్, ఇమ్రాన్ లకు తన ప్రేమ వ్యవహారాన్ని తెలియజేసి సహాయం చేయాలని రాజు కోరాడు. దీంతో అదే రోజు రాజేందర్ చంపాలని నిర్ణయించుకొని డ్యూటీ కి వెళ్లి వచ్చే సమయంలో అడ్డగించి కింద పడ్డ తర్వాత రాడుతో తల పగల కొట్టి చంపాలని ప్లాన్ చేసుకొని రాజు. సయ్యద్ గులాం. వాజిద్. ఇమ్రాన్లు నలుగురు కలిసి డ్యూటీకి వెళ్లి వచ్చే సమయంలో రాజేంద్ర యొక్క బైకును తనడంతో కింద పడిపోయాడు. అయితే మృతుడు రాజేందర్ గాయాలతో బయటపడడంతో మరలా ఒక రోజు నిందితులు రాజు. సయ్యద్. వాజిద్ లు కలిసి ఓకే బండి పై వచ్చి రాజేందర్ ను లిఫ్ట్ అడిగి తన బండి ఎక్కి సయ్యద్ వెనుక నుండి కొట్టడానికి ప్రయత్నించగా బండి పక్కన పడేసి రాజేందర్ పారిపోయాడు. మరోసారి మృతుడు రాజేందర్ ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో రాజు ఇందారం చెక్ పోస్టు ప్రాంతంలో కారుతో ఢీకొట్టగా గాయాలతో బయటపడ్డాడు.

 

Also Read : వినాయక చవితి వేడుకలకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి

ఇలా ప్రయత్నాలు చేసిన కొన్ని రోజుల తర్వాత బంధం రాజు బెల్ట్ షాప్ కు వచ్చిన జాడి@ నీలాల శ్రీనివాస్ తుపాకీ గురించి మాట్లాడగా తనకి తుపాకీ కావాలని చెప్పడంతో బీహార్ రాష్ట్రంలో 1 లక్ష 50 వేల రూపాయలకు ఇప్పిస్తానని చెప్పడంతో బీహార్ కి వెళ్లి తుపాకీ కొనుగోలు చేశారు. అయితే ఆరుసార్లు చంపడానికి ప్రయత్నం చేసిన విఫలం కావడంతో ఎలాగైనా ఈసారి చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఈ నెల 19వ తేదీన రాత్రి 10:30 గంటలకు బంధం రాజు తన స్నేహితుడు సయ్యద్ ను పల్సర్ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని గోదావరిఖని వచ్చాడు. రాత్రి రెండు గంటల సమయంలో రాజు. రవళి కి ఫోన్ చేసి తలుపు తీయమని చెప్పాడు. దీంతో ఇంట్లోకి వెళ్లిన నిందితులు బెడ్ పై పడుకొని ఉన్న రాజేందర్ కణతి భాగంలో రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న 1టౌన్ సీఐ లు రమేష్ బాబు. రాజకుమార్ గౌడ్ లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో పట్టుకొని వారి నుండి ఒక తుపాకీ 9 బుల్లెట్స్ మూడు సెల్ ఫోన్లు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఏసీపీ గిరిప్రసాద్ తో పాటు సీఐ లు. రమేష్ బాబు.  రాజకుమార్ గౌడ్. 2టౌన్ సీఐ శ్రీనివాసరావు. రామగుండం సిఐ లక్ష్మీనారాయణ. అబ్జాలోద్దీన్.  ఎస్. ఐ లు సుబ్బారావు. స్వామి. రమేష్. రామగిరి రవి ప్రసాద్. గోదావరిఖని క్రైమ్ పార్టీ ఎస్ఐ మల్లయ్య. కానిస్టేబుళ్లు తిట్ల శ్రీను. వెంకటేష్. అఖిల్. సురేష్. మధు. రైటర్ భూమయ్య. వేణు మల్లేష్ లను సిబ్బందిని డీసీపీ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube